Surprise Me!

Karnataka Lockdown : EC Responsible For Second Covid Wave - Madras High Court | Oneindia Telugu

2021-04-26 3 Dailymotion

EC responsible for second Covid wave: Madras High Court. Amazon partners ACT Grants, Temasek to bring in 10,000 oxygen concentrators, BiPAP machines into India
#KarnatakaLockdown
#ECresponsiblesecondCovidwave
#MadrasHighCourt
#oxygenconcentrators
#Amazonhelpsindia
#AmazonpartnersACTGrants
#BiPAPmachines
#coronavirusinindia
#Oxygencrisisinindia

కర్ణాటకలో ఊహించిన పరిణామమే సంభవించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది. ఈ లాక్‌డౌన్.. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి అమల్లోకి రానుంది. 14 రోజుల పాటు కొనసాగుతుంది. వచ్చేనెల 10వ తేదీ తెల్లవారు జామున 6 గంటల వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ సందర్భంగా ఎలాంటి వ్యాపార కార్యకలాపాలకు అవకాశం ఇవ్వలేదు. అత్యవసర సర్వీసులు మినహా మరెలాంటి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు అందుబాటులో ఉండబోవని తెలిపింది. కరోనా వచ్చిందా? అనే భయం కూడా ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన అశోక్(30) కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా అనే అనుమానంతో అతడ్ని.. తల్లి , సోదరుడు ఆదివారం రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. ర్యాపిడ్ ఫలితంలో నెగిటివ్ అని వచ్చింది.రెండోసారి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫలితం రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పడంతో ఆస్పత్రి ఆవరణలోని ఓ చెట్టు దగ్గర సేద తీరేందుకు కూర్చున్నారు. కాగా, చెట్టుకు ఒరిగి కూర్చున్న కుమారుడు అశోక్‌లో కదలికలు లేకపోవడంతో అతడి దగ్గరి వెళ్లి తట్టి చూసింది తల్లి గంగామణి. కొడుకు మృతి చెందాడని గ్రహించి భోరున విలపించింది. చెట్టంత కొడుకు కళ్లముందే ప్రాణాలు వదలడంతో ఆ మాతృమూర్తి కడుపుకోతను భరించలేకపోయింది. ఆ తల్లి రోదనలు అక్కడున్నవారిని కలిచివేశాయి.

Buy Now on CodeCanyon